Expand All   Collapse All

Best 200 Podupu Kathalu in Telugu, riddles with answers

Best 200 Podupu Kathalu in Telugu riddles with answers

What is the meaning of Podupu Kathalu in Telugu or Riddles in Telugu?

When we were children, we would have read a lot of riddles and the answers were always funny and confusing. The meaning of Podupu Kathalu in Telugu is simply “RIDDLE” in English. Podupu Kathalu are just riddle questions with twisted answers, many of which are very confusing and mean many different things. There are hundreds of different Podupu Kathalu in Telugu and these are very popular among children. Let us now learn some funny and interesting Podupu Kathalu in Telugu.

  • Podupu kathalu are stories which are portrayed in the form of funny questions (riddles) with twisted answers.
  • Podupu itself means pokable (or what we call as poking questions).
  • Podupu kathalu pokes your mind until you answer the riddles.
  • Podupu kathalu means the kind of short stories which raise curiosity and which makes a person think very hard and also gives a chance for listeners to improve their intelligence.

Best Telugu Short story books for children

I researched on Amazon and found that the below 5 are the best books for children available 🙂 They make perfect gifts for children and are also very cheap!!

Note from Author: Please don’t give sweets as gifts to children. Buy nice books for them and they will become more intelligent!

  1. Chandamama Kathalu
  2. Telugu Short story book for kids
  3. Panchatantra Kathalu
  4. 10 Panchatantra Kathalu books for cheap price
  5. Amaravati Kathalu

Topics

  1. What is the meaning of Podupu Kathalu in Telugu?
  2. About Podupu Kathalu in Telugu or Riddles in Telugu- తెలుగు పొడుపు కథలు
  3. Top 200 Podupu Kathalu in Telugu or Riddles in Telugu with answers

 

The below drawing was contributed by Alka Pagidimarri (Age: 13) from Mississauga, Ontario!!!! AWESOME WORK!!!!

podupu kathalu in english
podupu kathalu in english

About Podupu Kathalu in Telugu or Riddles in Telugu

Telugu is a very beautiful language and there are so many meanings for the same word. It is also a very descriptive language and poetically words can be used to explain different aspects. This is why there are so many Telugu riddles or Podupu Kathalu in Telugu.

Many of these Telugu riddles are very old and have been there for a few hundred years. Poets or Vkatakavis used to create them to test the intelligence of other poets of disciples. The beauty of Telugu riddles or Podupu Kathalu in Telugu is that the creation of these will never stop and you will always find ever new lists of Podupu Kathalu in Telugu.

 

Top 20 Podupu Kathalu in Telugu or Riddles in Telugu with answers

Now that we have learnt about Telugu riddles or Podupu Kathalu in Telugu, let us now read some super famous ones which will absolutely confuse you and make you think a lot. Remember to not see the answers until you decide you can no longer find them. The top 20 Podupu Kathalu in Telugu or Riddles in Telugu according to me are mentioned below

 

పొడుపుకథ: చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది?

సమాధానం :  ఉల్లిపాయ

 

పొడుపుకథ: జాన కాని జాన, ఏమి జాన?

సమాధానం : ఖజాన

 

పొడుపుకథ: తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది?

సమాధానం : వేరుశెనగ కాయ

 

పొడుపుకథ: లాగి విడిస్తేనే బ్రతుకు?

సమాధానం : ఊపిరి

 

పొడుపుకథ: పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు?

సమాధానం :పత్తి పువ్వు

 

పొడుపుకథ: పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే?

సమాధానం : దీపం

 

పొడుపుకథ: పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు?

సమాధానం : సూర్యుడు

 

పొడుపుకథ: మూత తెరిస్తే, ముత్యాల పేరు?

సమాధానం :దంతాలు

 

పొడుపుకథ: మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు?

సమాధానం :తేనె పట్టు

 

పొడుపుకథ: మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ?

సమాధానం :లవంగ మొగ్గ

 

పొడుపుకథ: ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?

సమాధానం :తేనె పట్టు

 

పొడుపుకథ: రసం కాని రసం, ఏమి రసం?

సమాధానం :నీరసం

 

పొడుపుకథ: మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన?

సమాధానం :పాలు, పెరుగు, నెయ్యి

 

పొడుపుకథ: మోదం కాని మోదం?

సమాధానం :ఆమోదం

 

పొడుపుకథ: రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది?

సమాధానం :ఉత్తరం

 

పొడుపుకథ: కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి?

సమాధానం :సీతాకోక చిలుక

 

పొడుపుకథ: రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు?

సమాధానం :మంగలి

 

పొడుపుకథ: రాజు నల్లన ప్రధాన పచ్చన, పాలు పుల్లన?

సమాధానం :తాటి చెట్టు

 

పొడుపుకథ: రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది?

సమాధానం :ఎండ, వాన, చలి

 

పొడుపుకథ: రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్లు?

సమాధానం :తేలు

 

Podupu Kathalu in Telugu or Riddles in Telugu
Podupu Kathalu in Telugu or Riddles in Telugu

21 – 40 Podupu Kathalu in Telugu or Riddles in Telugu with answers

YAAAAAAAAYYYYYYY!!!! You must now be really starting to like Telugu riddles or Podupu Kathalu in Telugu. You are done with 20 and now starting with the next 20 and by now you must  know how challenging they are!!! Remember to not see the answers until you decide you can no longer find them. The next 20 Podupu Kathalu in Telugu or Riddles in Telugu are given below

 

పొడుపుకథ: అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది

సమాధానం :దీపం వత్తి

 

పొడుపుకథ: కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు?

సమాధానం :మురళి

 

పొడుపుకథ: ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు?

సమాధానం :ఉల్లి

 

పొడుపుకథ: సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది?

సమాధానం :శంఖం

 

పొడుపుకథ: నీళ్లు నుంచి వ‌స్తుంది. నీకు నాకూ రుచిస్తుంది? ఇంత‌కీ ఏమిట‌ది?

సమాధానం: సాల్ట్‌

 

పొడుపుకథ: ఆకాశంలో పాములు ఏంట‌వి?

సమాధానం :  పొట్ల‌కాయ‌లు

 

పొడుపుకథ: ఆకులు లేని అడ‌విలో జీవం లేని జంతువు జీవాల‌ను వేటాడుతుంది ఏంట‌ది?

సమాధానం :  దువ్వెన‌

 

పొడుపుకథ: వీధిరాజుకు కొప్పుది కానీ జుట్టు లేదు, క‌ళ్ళున్నాయి కానీ చూపులేదు ఏంట‌ది?

సమాధానం :  కొబ్బ‌రికాయ‌

 

పొడుపుకథ: ఆరు ఆమ‌డ‌ల నుండి అల్లుడు వ‌స్తే అత్త‌గారు వ‌డ్డించింది విత్తులేని కూర ఏంట‌ది?

సమాధానం :  పుట్ట‌గొడుగుల కూర‌

 

పొడుపుకథ: తెల్ల‌టి పొలంలో న‌ల్ల‌టి విత్త‌నాలు, చేతితో చ‌ల్లుతాం, నోటితో ఏరుతాం ఏమిట‌వి?

సమాధానం :  పుస్త‌కంలో అక్ష‌రాలు

 

పొడుపుకథ: ముక్కు మీద‌కెక్కు, ముదుర చెక్కుల నొక్కు, ట‌క్కు నిక్కుల సొక్కు జారిందో పుటుక్కు ఏమిట‌ది?

సమాధానం :  క‌ళ్ల‌జోడు

 

పొడుపుకథ: తోలు న‌లుపు, తింటే పులుపు, ఏంటో అది?

సమాధానం :  చింత‌పండు

 

పొడుపుకథ: కుడితి తాగ‌దు, మేత మెయ్య‌దు, కానీ క‌డివెడు పాలు ఇస్తుంది. ఏంట‌ది?

సమాధానం :  తాటిచెట్టు

 

పొడుపుకథ: స‌న్న‌టి స్థంభం, ఎవ్వ‌రూ ఎక్క‌లేరు, దిగ‌లేరు ఏంట‌ది?

సమాధానం :  సూది

 

పొడుపుకథ: అగ్గిపెట్టెలో ఇద్ద‌రు పోలీసులు ఏంట‌ది?

సమాధానం :  వేరుశ‌న‌గ కాయ‌

 

పొడుపుకథ: ఇంట్లో మొగ్గ బ‌య‌ట‌కొస్తే పువ్వు?

సమాధానం :  గొడుగు

 

పొడుపుకథ: కాళ్ళున్నా పాదాలే లేనిది ఏంట‌ది?

సమాధానం :  కుర్చీ

 

పొడుపుకథ: చ‌క్క‌న‌మ్మ చిక్కినా అందంగా ఉంటుంది? ఏంట‌ది?

సమాధానం :  స‌బ్బు

 

పొడుపుకథ: ప‌చ్చ‌ని పాముకు తెల్ల‌ని చార‌లు? ఏంట‌ది?

సమాధానం :  పొట్ల‌కాయ‌

 

పొడుపుకథ: నాలుగు క‌ర్ర‌ల మ‌ద్య న‌ల్ల‌రాయి? ఏంట‌ది?

సమాధానం :  ప‌ల‌క‌

 

Riddles in Telugu
Riddles in Telugu

41 – 60 Podupu Kathalu in Telugu or Riddles in Telugu with answers

WHOOOHHHOOOOOO!!! 2 sets of Telugu riddles or Podupu Kathalu in Telugu are finished. You have now successfully mastered 40 riddles and have only 160 more to go. Let us now continue and read some more famous ones which will make you smile as you answer them. Remember to not see the answers until you decide you can no longer find them. The next 20 Podupu Kathalu in Telugu or Riddles in Telugu are mentioned below.

 

పొడుపుకథ: చెట్టుకు కాయ‌ని కాయ కర‌క‌ర‌లాడే కాయ‌? ఏంట‌ది?

సమాధానం :  క‌జ్జికాయ‌

 

పొడుపుకథ: అడ‌విలో పుట్టాను అడ‌విలో పెరిగాను వంటినిండా గాయాలు క‌డుపునిండా రాగాలు

సమాధానం :  ముర‌ళి – ఫ్లూట్‌

 

పొడుపుకథ: ఈ ప్ర‌పంచ‌లోని వారంద‌రూ నా బిడ్డ‌లే కాని అమ్మా! అని న‌న్నెవ‌రు పిల‌వ‌రు ఏం చేయాల‌న్నా ఏమి పొందాల‌న్నా నాలోనే ఎటూ పోవాల‌న్నా ఎక్క‌డికి వెళ్లాల‌న్నా నా మీదే..నేనెవ‌ర్ని?

సమాధానం :  భూమి

 

పొడుపుకథ: తెల్ల‌టి శ‌న‌గ‌ల‌లో ఒక‌టేరాయి, చేతితో చ‌ల్ల‌డం నోటితో ఏరుకోవ‌డం ఏంట‌ది?

సమాధానం :  పుస్త‌కం

 

పొడుపుకథ: రాజుగారి తోట‌లో రోజాపూలు చూచేవారేగాని లెక్క‌వేసేవారు కాదు ఏమిట‌వి?

సమాధానం :  చుక్క‌లు

 

పొడుపుకథ: జీడివారి కోడ‌లు సిరిగ‌ల వారికి ఆడ‌ప‌డుచు వ‌య‌సులో కులికే వ‌య్యారి వైశాఖ‌మాసంలో వ‌స్తుంది.

సమాధానం :  మామిడి పండు

 

పొడుపుకథ: కిరు కిరు త‌లుపులు కిటారు త‌లుపులు వెయ్యంగ వెయ్య‌స్త‌వి గాని తియ్యంగా తియ్య‌రావు ఏంట‌వి?

సమాధానం :  ముగ్గు

 

పొడుపుకథ: అడ‌విలో పుట్టింది అడ‌విలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైత‌క్క లాడింది.

సమాధానం :  చిల్ల క‌వ్వ‌

 

పొడుపుకథ: పొంగ బోడ‌ది రాంగ జుట్టుది ఏంట‌ది?

సమాధానం :  పేలాలు

 

పొడుపుకథ: చీక‌టింట్లో జ‌డ‌ల ద‌య్యం ఏమిట‌ది?

సమాధానం :  ఉట్టి

 

పొడుపుకథ: గారు కాని గారు, ఏమిగారు?

సమాధానం :  కంగారు

 

పొడుపుకథ: అది లేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు?

సమాధానం :  ఆకలి

 

పొడుపుకథ: అందరూ నన్ను పట్టుకుంటారు కాని నేనే ఎవరిని పట్టుకొను, అందరూ నాతో మాట్లాడతారు కాని నేనే ఎవరితో మాట్లాడను?

సమాధానం :  టెలిఫోన్

 

పొడుపుకథ: గీత కాని గీత, ఏమి గీత?

సమాధానం :  భగవద్గీత

 

పొడుపుకథ: గోళము కాని గోళము, ఏమి గోళము?

సమాధానం :  గందర గోళము

 

పొడుపుకథ: అన్నం పెడితే ఎగురదు, పెట్టకపోతే ఎగురుతుంది?

సమాధానం :  విస్తరాకు

 

పొడుపుకథ: అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకి?

సమాధానం :  తేనే పట్టు

 

పొడుపుకథ: అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురూ తిరుగుతారు, మానితే ముగ్గురూ మానుతారు?

సమాధానం :  ఫ్యాన్

 

పొడుపుకథ: అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే, పరుగెత్తలేక పది మంది చచ్చారు.

సమాధానం :  పిడుగు

 

పొడుపుకథ: ఆడవారికి ఉండనిది, మగవారికి ఉండేది?

సమాధానం :  మీసము

 

Podupu Kathalu in Telugu
Podupu Kathalu in Telugu

61 – 80 Podupu Kathalu in Telugu or Riddles in Telugu with answers

AMAAAAAAAAZING!!!!!! You really are progressing super fast and are unstoppable. You have done 60 and just have 140 more to go. I am telling you honestly that you should feel proud of yourself. Telugu riddles are not easy and can really make you think a lot. Podupu Kathalu in Telugu can be notoriously difficult and will approach complex life problems in an intricate way.

 

పొడుపుకథ: ఆడదానికి పుట్టినింట ఒకటి, మెట్టినింట ఒకటి?

సమాధానం :  ఇంటి పేరు

 

పొడుపుకథ: ఆడవారు తక్కువగా మాట్లాడే నెల?

సమాధానం :  ఫిబ్రవరి

 

పొడుపుకథ: ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంటుంది?

సమాధానం :  చీపురు

 

పొడుపుకథ: ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి?

సమాధానం :  మ్యాపులో

 

పొడుపుకథ: ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము?

సమాధానం :  పంచదార

 

పొడుపుకథ: ఇక్కడ వత్తు! అక్కడ వెలుగు!!?

సమాధానం :  స్విచ్, బల్బ్

 

పొడుపుకథ: అన్నదమ్ములు ఇద్దరు, ఒకరంటే మరొకరికి పడదు, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. వారి మధ్యకు ఎవరైనా వొస్తే పచ్చడి పచ్చడే?

సమాధానం : ఇసుర్రాయి

 

పొడుపుకథ: ఇద్దరు అక్క చెల్లెల్లు, ప్రపంచం మొత్తం తిరిగి చూసినా, ఒకరినొకరు చూసుకోరు?

సమాధానం : కళ్ళు

 

పొడుపుకథ: ఇల్లు మొత్తం వెలుగు, బల్ల కింద చీకటి?

సమాధానం : దీపం

 

పొడుపుకథ: ఇవ్వకుండా తీసుకో లేనిది! తీసుకోకుండా ఇవ్వ లేనిది!!?

సమాధానం : ముద్దు

 

పొడుపుకథ: అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు ఎంత దూరం పోతే రెండవ వారు అంతే దూరం పోతారు?

సమాధానం : కాళ్ళు

 

పొడుపుకథ: ఈగ ముసరని పండు! ఇంటిలో నుండు!!?

సమాధానం : నిప్పు

 

పొడుపుకథ: ఈత చెట్టుకు ఇద్దరు బిడ్డలు?

సమాధానం : కల్లు కుండలు

 

పొడుపుకథ: ఊరంతా కదిలిన, ఊరగాయ కుండ కదలదు?

సమాధానం : బావి

 

పొడుపుకథ: ఉరికంత ఒక్కటే దుప్పటి?

సమాధానం : ఆకాశము

 

పొడుపుకథ: ఎర్రనిచెట్టు! నీళ్లు పోస్తే చస్తుంది!!?

సమాధానం : అగ్ని

 

పొడుపుకథ: మాములు వేళలో మర్యాదగా ఉంటుంది, ఎండకు వానకు నెత్తినెక్కుతుంది?

సమాధానం : గొడుగు

 

పొడుపుకథ: ఎర్రగా ఉంటాను కాని నేనెవరితో సరసాలాడను, నన్ను ముట్టుకుంటే ఊరుకోను.

సమాధానం : నిప్పు

 

పొడుపుకథ: ఎగిరే పిట్ట, రెక్కలు లేని పిట్ట! ఆటలాడుకునే పిట్ట, పిల్లల పిట్ట!!?

సమాధానం : గాలి పటము

 

పొడుపుకథ: ఎనమిది ఎముకలు! తట్టెడు ప్రేగులు!!?

సమాధానం : మంచము

 

 

81 – 100 Podupu Kathalu in Telugu or Riddles in Telugu with answers

FANTABULOUSS!!!!! You really are rocking here. 80 done and just 120 more to go. With this set you will cross the halfway mark and complete 100 Telugu riddles or Podupu Kathalu in Telugu. This itself is an awesome feat and you should feel proud of yourself. Telugu Riddles or in fact Riddles  in any language for that matter, teach how to approach complex problems in life in a different way and give birth to creativity and efficiency.

 

పొడుపుకథ: ఎముకలు లేని జీవము, ఏటికి పోయింది?

సమాధానం : జలగ

 

పొడుపుకథ: ఏది పెడితే అరిగి పోతుంది?, ఏది పెడితే కలకాలం ఉంటుంది?

సమాధానం : అన్నము, వాత

 

పొడుపుకథ: అమ్మంటే దగ్గరకొచ్చి నాన్నంటే దూరంగా పోతాయి?

సమాధానం : పెదవులు

 

పొడుపుకథ: ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి?

సమాధానం : తక్కెడ

 

పొడుపుకథ: అడుగులున్నా, కాళ్ళులేనిది?

సమాధానం : గజము బద్ద, మీటర్ స్కేలు

 

పొడుపుకథ: ఒకరు పొడుస్తారు, ఒకరు విడుస్తారు?

సమాధానం : పొడుపు కథ

 

పొడుపుకథ: నల్ల స్తంభం పైన నలుగురు దొంగలు?

సమాధానం : లవంగం మొగ్గ

 

పొడుపుకథ: అందని వస్త్రం పై అన్నీ వడియాలే?

సమాధానం : నక్షత్రాలు

 

పొడుపుకథ: కాయలు కాని కాయలు, ఏమి కాయలు?

సమాధానం : మొట్టి కాయలు

 

పొడుపుకథ: అందరికి చెప్పి వొచ్చేది, చెప్పకుండా వెళ్ళేది?

సమాధానం : ప్రాణం

 

పొడుపుకథ: అందమైన చిన్నది, అందాల చిన్నది, నువ్వు చుస్తే నిన్ను చూస్తుంది, నేను చుస్తే నన్ను చూస్తుంది?

సమాధానం : అద్దము

 

పొడుపుకథ: కీచు కీచు పిట్ట! నేలకేసి కొట్ట!!

సమాధానం : చీమిడి

 

పొడుపుకథ: కిట కిట తలుపులు! కిటారు తలుపులు!! ఎప్పుడు తీసినా చప్పుడు కాదు?

సమాధానం : కను రెప్పలు

 

పొడుపుకథ: కిరీటము ఉంటుంది కాని రాజును కాదు, నాట్యము చేస్తాను కాని మయూరిని కాదు?

సమాధానం : నాగుపాము

 

పొడుపుకథ: కాటుక రంగు, కమలము హంగు! విప్పిన పొంగు, ముడిచిన క్రుంగు!!?

సమాధానం : గొడుగు

 

పొడుపుకథ: తల లేదు కాని గొడుగు ఉంది, పాము లేదు కాని పుట్ట ఉంది?

సమాధానం : పుట్ట గొడుగు

 

పొడుపుకథ: కడుపు లోన పిల్లలు, కంఠము లోన నిప్పులు! అరుపేమో ఉరుము, ఎరుపంటే భయము!!?

సమాధానం : రైలు

 

పొడుపుకథ: కార్డు కాని కార్డు, ఏమి కార్డు?

సమాధానం : రికార్డు

 

పొడుపుకథ: కాయ, పువ్వు లేని పంట?

సమాధానం : ఉప్పు పంట

 

పొడుపుకథ: కలి కాని కలి, ఏమి కలి?

సమాధానం : చాకలి

 

 

101 – 120 Podupu Kathalu in Telugu or Riddles in Telugu with answers

Now you done with 100 and getting the hang of it!!!! Telugu riddles or Podupu Kathalu in Telugu are quite easy and you just need to have a bit of lateral thinking and you’ll do awesome! Let us now read the next 20 Podupu Kathalu in Telugu.

 

పొడుపుకథ: కోడి కాని కోడి, ఏమి కోడి?

సమాధానం : చకోడి

 

పొడుపుకథ: కొనే టప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పారేసేటప్పుడు తెలుపు ఏమిటది?

సమాధానం : పుచ్చకాయ

 

పొడుపుకథ: అన్నింటికన్నా విలువైనది, అందరికి అవసరమైనది?

సమాధానం : ప్రాణము

 

పొడుపుకథ: గింజ మునుగుతుంది, కాయ తేలుతుంది?

సమాధానం : వేరుశెనగ కాయ

 

పొడుపుకథ: కర్రలతో అతి చిన్న కర్ర?

సమాధానం : జీలకర్ర

 

పొడుపుకథ: గట్టుమీద రాయి! మినుకు మినుకు రాయి!!

సమాధానం : ముక్కు పుడక

 

పొడుపుకథ: గాలిలో ఎగిరే అద్దము పట్టుకుంటే పలిగి పోవు?

సమాధానం : సబ్బు బుడగ

 

పొడుపుకథ: కాయ కాని కాయ, అతి చిన్న కాయ?

సమాధానం : చెమటకాయ

 

పొడుపుకథ: గోడకు గొలుసు పండు!?

సమాధానం : లాంతరు

 

పొడుపుకథ: చీకటి ఇంటిలో జడల దయ్యము?

సమాధానం : ఉట్టి

 

పొడుపుకథ: చింపిరి గుడ్డలు! బంగారం లాంటి బిడ్డలు!!

సమాధానం : మొక్క జొన్న

 

పొడుపుకథ: చిన్న చిట్టిలో కమ్మని కూర?

సమాధానం : కిల్లీ

 

పొడుపుకథ: చిక్కటి కారడవిలో చక్కటి దారి?

సమాధానం : పాపిట

 

పొడుపుకథ: చారల పాపకి దూది కుచ్చు!

సమాధానం : ఉడుత

 

పొడుపుకథ: నూరు పళ్ళు ఒకటే నోరు?

సమాధానం : దానిమ్మ

 

పొడుపుకథ: సన్నని స్తంభం, ఎక్కలేరు, దిగలేరు?

సమాధానం : సూది

 

పొడుపుకథ: ఎర్రవాడొస్తే తెల్లవాడు, పారిపోయి దాక్కుంటాడు?

సమాధానం : సూర్యుడు, చంద్రుడు

 

పొడుపుకథ: పొంచిన దయ్యం! ఉన్న చోట ప్రత్యక్షం!!

సమాధానం : నీడ

 

పొడుపుకథ: అంగట్లో ఉంటాను, ఇంట్లో అంగి విప్పుతాను! నన్ను గాని ముట్టుకుంటే నూతిలో దూకుతాను!!

సమాధానం : అరటి పండు

 

పొడుపుకథ: ఇంట్లో మొగ్గ, వీధిలో పువ్వు?

సమాధానం : గొడుగు

 

 

121 – 140 Podupu Kathalu in Telugu or Riddles in Telugu with answers

BRILLIANT!!! We have covered so so so so so many Telugu riddles or Podupu Kathalu in Telugu. Let us now read the next 20 and quickly get done with it J

 

పొడుపుకథ: అడవిలో పుట్టాను, నల్లగా అయ్యాను, ఇంటికి వచ్చాను, ఎర్రగా మారాను, తొట్టిలో పడ్డాను తెల్లగా మారాను?

సమాధానం : బొగ్గు

 

పొడుపుకథ: పైన పచ్చ ఏనుగు, లోన తెల్ల పీనుగు?

సమాధానం : అరటి కాయ

 

పొడుపుకథ: బారు కాని బారు, ఏమి బారు?

సమాధానం : సాంబారు

 

పొడుపుకథ: పిల్లలకు ఉచితము! పెద్దలకు బహుమానము!! యూవతీ యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము?

సమాధానం : ముద్దు

 

పొడుపుకథ: హారము కాని హారము, ఏమి హారము?

సమాధానం : ఆహారము

 

పొడుపుకథ: పుట్టినపుడు పురుగు! పెరిగితే పువ్వుల రాజు?

సమాధానం : భ్రమరము

 

పొడుపుకథ: బడి కాని బడి, ఏమి బడి?

సమాధానం : రాబడి

 

పొడుపుకథ: పగలు తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాక్షసి!?

సమాధానం : గబ్బిలం

 

పొడుపుకథ: బొట్టు కాని బొట్టు, ఏమి బొట్టు?

సమాధానం : తాళిబొట్టు

 

పొడుపుకథ: పచ్చని గుడిలో ఎరుపు రత్నాలు?

సమాధానం : దానిమ్మ గింజలు

 

పొడుపుకథ: బాడీ కాని బాడీ, ఏమి బాడీ?

సమాధానం : లంబాడి

 

పొడుపుకథ: పలుకు కాని పలుకు, ఏమి పలుకు?

సమాధానం : వక్క పలుకు

 

పొడుపుకథ: పైన పటారాము! లోన లొటారాము!!?

సమాధానం : మేడి పండు

 

పొడుపుకథ: మతి కాని మతి, ఏమి మతి?

సమాధానం : శ్రీమతి

 

పొడుపుకథ: మంచము కింద మామ! ఉరికి పోదాం రావా!!?

సమాధానం : చెప్పులు

 

పొడుపుకథ: మర కాని మర, ఏమి మర?

సమాధానం : పడమర, అలమర

 

పొడుపుకథ: మూడు కన్నులుండు, ముక్కంటిని కాను! నిండా నీరు ఉండు, కుండను కాను!!

సమాధానం : కొబ్బరి కాయ

 

పొడుపుకథ: మామ కాని మామ, ఏమి మామ?

సమాధానం : చందమామ

 

పొడుపుకథ: మీకు సొంతమైనది కాని, మీకన్నా మీ తోటి వారు ఎక్కువగా వాడతారు?

సమాధానం : మీ పేరు

 

పొడుపుకథ: మని కాని మని, ఏమి మని?

సమాధానం : ఆమని

 

 

 

141 – 160 Podupu Kathalu in Telugu or Riddles in Telugu with answers

WHOOOHOOOOOOOO!!!!! 140 Telugu riddles or Podupu Kathalu in Telugu have been completed!!! Let us now proceed to read the next 20 famous ones which will baffle you! DON’T see the answers until you completely give up!! The next 20 Podupu Kathalu in Telugu or Riddles in Telugu are below.

 

పొడుపుకథ: మానము కాని మానము, ఏమి మానము?

సమాధానం : విమానము

 

పొడుపుకథ: మేమిద్దరం మిమ్మల్ని మోస్తాము, మీ అవసరము తీరాక మూలన పడుకుంటాము?

సమాధానం : చెప్పులు

 

పొడుపుకథ: పచ్చని పొదలో పిచ్చుక విచ్చుకుంది! తెచ్చుకోబోతే గుచ్చుకుంది?

సమాధానం : మొగిలి పువ్వు

 

పొడుపుకథ: చెవుల పక్క నక్కి ముక్కు మీదకెక్కుతుంది?

సమాధానం : కళ్ళ జోడు

 

పొడుపుకథ: మేక తిన్నాను, తోక పారేశాను?

సమాధానం : వంకాయ

 

పొడుపుకథ: మూసింది తెరువ! తెరువంగ అరువ!!?

సమాధానం : ఆవులింత

 

పొడుపుకథ: రాజు వారి తోటలో రోజూ కాసే పూలు! చూసే వారే కాని కోసే వారు లేరు!!?

సమాధానం : నక్షత్రాలు

 

పొడుపుకథ: వరి కాని వరి, ఏమి వరి?

సమాధానం : జనవరి

 

పొడుపుకథ: ప్రపంచం మొత్తం తిరిగేది, అన్నింటికన్నా వేగమైనది?

సమాధానం : మనసు

 

పొడుపుకథ: శాఖలున్నా ఆకులు లేనిది?

సమాధానం : సంస్థ

 

పొడుపుకథ: చాచుకొని, సావిట్లో పడుకునే ముసలమ్మ, ముడుచుకొని మూల నిలబడింది?

సమాధానం : చాప

 

పొడుపుకథ: చెయ్యని కుండ! పోయని నీరు!!?

సమాధానం : కొబ్బరి కాయ

 

పొడుపుకథ: నరుడు కాని నరుడు, ఏమి నరుడు?

సమాధానం : వానరుడు

 

పొడుపుకథ: నగలు కాని నగలు, ఏమి నగలు?

సమాధానం : శెనగలు

 

పొడుపుకథ: నూరుగురు అన్నా తమ్ముళ్లకు ఒకటే మొలతాడు?

సమాధానం : చీపురు

 

పొడుపుకథ: పట్టుకుంటే పిడికెడు, విడిస్తే ఇల్లంతా?

సమాధానం : దీపం

 

పొడుపుకథ: పట్టు సంచిలో బంగారు గుడ్లు?

సమాధానం : ఎండు మిరపకాయలు

 

పొడుపుకథ: మనదొకటి తడవదు, ఎండదు, ఆరదు?

సమాధానం : నీడ

 

పొడుపుకథ: వెండి గిన్నెలో దాగిన బంగారం?

సమాధానం : కోడి గుడ్డు

 

పొడుపుకథ: మనిషి మనిషి మధ్య రథ సారథి నేను, నేను లేకుంటే ప్రపంచమే లేదు?

సమాధానం : ప్రేమ

 

181 – 200 Podupu Kathalu in Telugu or Riddles in Telugu with answers

Let us now learn the last set of Telugu riddles or Podupu Kathalu in Telugu. Hopefully this will be able to confuse you and make you scratch you head!!! As usual, my reminder to you will be to not to see the answers for the Podupu Kathalu in Telugu until you decide you can no longer find them. The last 20 Podupu Kathalu in Telugu or Riddles in Telugu according to me are given below J

 

పొడుపుకథ: రెక్కలుంటాయి, రయ్ రయ్ మంటుంది, ఎగురలేదు కాని ఎగురవేస్తుంది?

సమాధానం : ఫ్యాన్

 

పొడుపుకథ: రణము కాని రణము, ఏమి రణము?

సమాధానం : చరణము

 

పొడుపుకథ: బంగారు బిడ్డలు, వెచ్చని దుస్తులు, గుర్రపు వెంట్రుకలు?

సమాధానం : మొక్కజొన్న

 

పొడుపుకథ: రాయి కాని రాయి, ఏమి రాయి?

సమాధానం : కిరాయి

 

పొడుపుకథ: ఉన్న చోటే ఉంటుంది, వేళా పాలా చెపుతుంది?

సమాధానం : గోడ గడియారం

 

పొడుపుకథ: రంగము కాని రంగము, ఏమి రంగము?

సమాధానం : చదరంగము

 

పొడుపుకథ: మతము కాని మతము, ఏమి మతము?

సమాధానం : కమతము

 

పొడుపుకథ: అన్నకు అందవు కాని తమ్ముడికి అందుతాయి?

సమాధానం : పెదవులు

 

పొడుపుకథ: వాలు కాని వాలు, ఏమి వాలు?

సమాధానం : ఆనవాలు

 

పొడుపుకథ: రేట్లెంత పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వొచ్చేవి?

సమాధానం : రెండు ఐదు పైసల బిళ్ళలు

 

పొడుపుకథ: వల కాని వల, ఏమి వల?

సమాధానం : నవల

 

పొడుపుకథ: రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు?

సమాధానం : చంద్రుడు

 

పొడుపుకథ: గుప్పెడంత లోగిలిలో యాభై మంది నివాసం?

సమాధానం : అగ్గి పెట్టె

 

పొడుపుకథ: వారు కాని వారు, ఏమి వారు?

సమాధానం : నవారు

 

పొడుపుకథ: విత్తనం లేకుండా మొలిచేది?

సమాధానం : గడ్డము

 

పొడుపుకథ: కాళ్ళు లేవు కానీ నడుస్తుంది ? కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ?

Meaning of question: It has no legs but walks. It has no eyes but cries. What is it?

Answer: A cloud

 

పొడుపుకథ: అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి?

Meaning of the question: they do not meet father(ayya), but they meet mother (amma)

Answer: Lips.

 

పొడుపుకథ: చిటారు కొమ్మన మిఠాయి పొట్లం?—-Chitaru kommana mitayi potlam

Meaning of the question: a packet of sweet candy at the top of the tree.

Answer: Honeycomb.

 

పొడుపుకథ: ముగ్గురు అన్నదమ్ములకు ఒకటే టోపీ?

Meaning of the question: There is a single cap for three brothers.

Answer: Palm fruit (there will be three sections in one palm fruit)

 

పొడుపుకథ: తోకలేని పిట్ట తొంబై ఆమడలు తిరుగుతుంది

Meaning of the question: The bird without a tail makes a journey of 90 miles.

Answer: A letter

 

పొడుపుకథ: తండ్రి గరగర, తల్లి పీచుపీచు, పిల్లలు రత్నమాణిక్యాలు, మనుమలు బొమ్మ రాళ్ళు?

Meaning of the question: The Father is rough, the mother is woolly, the children are like gem stones and the grand children are like stone toys or like toy stones.

Answer: Jack fruit (There are many layers in a jackfruit which are like the outer layer which is rough, inner fibrous layer which is wolly, sweet sections which are the fruit, seeds inside sections which are very hard almost like stones used as toys by children)

 

పొడుపుకథ: కిటకిట తలుపులు కిటారి తలుపులు, మూసినా తీసినా చప్పుడు కావు

Meaning of the question: There are two doors which are always regularly closed and opened. The cute doors make no sound while opening and closing.

Answer: Eye lids

 

Tags:

#Podupu Kathalu in Telugu, #Podupu Kathalu in Telugu with answers, #Podupu Kathalu, #Podupu Kathalu in Telugu Images, #Funny Podupu Kathalu in Telugu, #New Podupu Kathalu in Telugu, #Telugu Riddles, #Riddles in Telugu with answers, #Telugu Riddles with answers

One comment

  1. […] cherished as an engaging form of entertainment. However, they offer much more than mere amusement. Telugu Riddles are a powerful tool for enhancing children’s intelligence, cognitive abilities, and […]

Leave a Reply